Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ హీరోయిన్స్ నాతో బాగా మాట్లాడేవారు : సీనియర్ నటి అన్నపూర్ణ

Annapurnamma Interview
Advertisement
  • వందల సినిమాలు చేసిన అన్నపూర్ణ
  • తెలుగు ఇండస్ట్రీ మంచిదని వెల్లడి 
  • ఇతర ఇండస్ట్రీలు మనలా కాదని వ్యాఖ్య 
  • ఫంక్షన్స్ కి పెద్దగా వెళ్లనని వివరణ 

Advertisement
అన్నపూర్ణ.. తెలుగులో తల్లి పాత్రల పరంగా నిర్మలమ్మ తరువాత ఆంతటి గుర్తింపు తెచ్చుకున్న నటి. కొన్ని వందల సినిమాల్లో నటించిన అనుభవం ఆమె సొంతం. విషయమేదైనా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం ఆమె స్వభావం.  అలాంటి అన్నపూర్ణ 'ఐడ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

" ఇతర సినిమా ఇండస్ట్రీలతో పోల్చితే మన తెలుగు ఇండస్ట్రీ చాలా మంచిదనే చెప్పాలి. ఇతర ఇండస్ట్రీలవారు మన తెలుగువాళ్లంతా మంచి వాళ్లయితే కాదు. వాళ్లంతా కూడా వాళ్ల వాళ్లకి పెడదామనుకుంటారు. మనవాళ్లేమో పక్కవాళ్లకి పెడదామని అనుకుంటారు. మనంత పిచ్చివాళ్లు కాదని కూడా చెప్పుకోవచ్చు" అన్నారు. 

" అప్పటి హీరోయిన్స్ లో శ్రీదేవి .. సౌందర్య .. విజయశాంతి .. రాధ నాతో బాగా మాట్లాడేవారు. ఇక నేను .. శ్రీలక్ష్మి .. డబ్బింగ్ జానకి .. వై. విజయ స్నేహంగా ఉంటాం. ఎక్కడికి వెళ్లినా కలిసి వెళుతూ ఉంటాము. బాగా దగ్గర వాళ్లయితేనే వెళతాను. లేదంటే ఇంటి పట్టున ఉండటానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను" అని చెప్పారు. 
Advertisement
Advertisement
Annapurnamma
Actress
Tollywood

More Telugu News